శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:30 IST)

ఒత్తిడిని జయించలేకే ఓడిపోయాం : సౌతాంప్టన్ టెస్ట్ ఫలితంపై కోహ్లీ కామెంట్స్

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిర

సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 60 పరుగుల తేడాతో విజయభేరీమోగించింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. కేవలం 245 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించలేక కోహ్లీ సేన ఓడిపోయింది.
 
దీనిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ స్పందిస్తూ, 'ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. లోయర్ ఆర్డర్ బాగా ఆడింది. ఇలాంటి పిచ్ పై 245 రన్స్ సాధించడం గొప్ప విషయం. ఈ టార్గెట్ విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఛేజింగ్‌లో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. కానీ ఒత్తిడితో త్వరగా అవుటయ్యాం. పూజారా, రహానే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడారు' అని కోహ్లీ అన్నాడు.