గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:12 IST)

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా, దారుణమైన ఆటతీరు

టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ విషయంలో టపాటపా వికెట్లు పారేసుకుంటోంది. న్యూజీలాండు-ఇండియా మధ్య ఆదివారం నాడు టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

 
న్యూజీలాండ్ బౌలర్ల పటిష్టమైన బంతుల దెబ్బకి టీమిండియా బ్యాట్సమన్లు చేతులెత్తేశారు. కెఎల్ రాహుల్ 18 పరుగులు, ఇషాన్ కిషాన్ 4 పరుగులు, రోహిత్ శర్మ-14 పరుగులకే ఔటయ్యాడు. ఇక విరాట్ కోహ్లి 9 పరుగులు, రిషబ్ పంత్ 12, హార్దిక్ పాండ్యా 23 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగులు చేసారు. 19 ఓవర్ నడుస్తున్న సమయానికి కనీసం 100 పరుగులు కూడా దాటలేకపోయారు. 20 ఓవర్లకి కేవలం 110 పరుగులు మాత్రమే చేసారు.

మరి న్యూజీలాండ్ రిప్లై ఎలా వుంటుందో మరికొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. ఈ మ్యాచ్ కనుక తేడా కొడితే టీమ్ ఇండియా పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.