దంబుల్లా వన్డే : శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

సోమవారం, 21 ఆగస్టు 2017 (05:58 IST)

sikhar dhawan

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన... ఇపుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, ఆదివారం దంబుల్లాలో వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 216 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని బ్యాట్స్‌మెన్లు డిక్‌వెల్లా 64, గుణ‌తిల‌క 35, కుశ‌ల్ మెండిస్ 36, కెప్టెన్ త‌రంగ 13, మాథ్యూస్ 36, క‌పుగెదెర 1, డిసిల్వా 2 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు... 28.5 ఓవర్లలోనే 216 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించి 220 పరుగులతో విజయపరంపర కొనసాగించింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 90 బంతుల్లో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
అలాగే, విరాట్ కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్), రోహిత్ శర్మ 4 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును శిఖర్ ధవన్ అందుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ ప‌టేల్ 3, య‌జువేంద్ర చాహ‌ల్ 2, కేదార్ జాద‌వ్ 2 వికెట్లు తీసి లంకేయుల నడ్డి విరిచారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బాపట్ల యువ క్రికెటర్ వీరబాదుడు.. 29 బంతుల్లో 100 రన్స్...

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ వీరబాదుడి ...

news

వీర కుమ్ముడు... 73 బంతుల్లో 161 ర‌న్స్... ఎవరు? (Video)

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడ‌మ్ లిత్‌ దుమ్మురేపాడు. నాట్‌వెస్ట్ టీ20 క్రికెట్ టోర్న‌మెంట్‌లో ...

news

ఐసీసీ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ.. టాప్-10లో లేని బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు

తాజాగా ఐసీసీ విడుదల చేసిన పరిమిత ఓవర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారథి, స్టార్ ...

news

ధోనీలో ఆ సత్తా ఉంది.. 2019 ప్రపంచకప్ తర్వాత చెప్పలేం: మైక్ హస్సీ

2019 ప్రపంచ కప్ వరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో కొనసాగుతారా అని ...