ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

నేడు యంగ్ ఇండియా వర్సెస్ శ్రీలంక : కొలంబో వేదికగా ఫస్ట్ వన్డే

భారత్ శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంక, యంగ్ ఇండియా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనుంది. 
 
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ టోర్నీలో కొత్త కుర్రాళ్లు తమ సత్తా చూపాలని ఆరాటపడుతున్నారు. తద్వారా టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులో తాము స్థానం సంపాదించాలని పృథ్వీషా, దీపక్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కుర్రాళ్లు భావిస్తున్నారు.
 
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ జట్టు కాకుండా యంగ్ టీం బరిలోకి దిగుతుండగా.. తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకలోని యంగ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
భారత జట్టు వివరాలు... ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్, కృనాల్, నితీశ్ రాణా, ఇషాన్, సామ్సన్, చాహల్, గౌతమ్, కుల్దీప్, చక్రవర్తి, భువి, సైనీ, రాహుల్, దీపక్ చహర్, చేతన్ సకారియా.