సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (12:05 IST)

చెత్త బౌలింగ్.. అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు.. ఏంటయ్యా ఇది..?

Arshadeep
Arshadeep
భారత్-శ్రీలంక మధ్య జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి ఐదు నోబాల్స్‌తో 37 పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిన్నటి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 5 నో బాల్స్ వేశాడు. 
 
తద్వారా 37 పరుగులు ఇచ్చాడు. శ్రీలంకతో జరిగిన రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు నోబాల్స్ వేసి ఆ ఓవర్‌లోనే 19 పరుగులు ఇచ్చాడు. దీని తర్వాత 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. దీంతో బిత్తరపోయింది టీమిండియా.
 
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా షాకయ్యాడు. ఇన్నింగ్స్ చివరికి వచ్చే వరకు అర్షదీప్ సింగ్‌తో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు. శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక అవుట్ కాగా, నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఈ సమయంలో హార్థిక్ పాండ్యా బాధపడటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.