సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (22:17 IST)

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్లక్ష్యం వల్ల పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీ ఫైనల్లో బాగంగా ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస చేస్తున్న ఆటగాళ్లను ఉన్నపళంగా హోటల్‌ నుంచి సిబ్బంది ఖాళీ చేయించారు. దీంతో ఆటగాళ్లు లగేజితో రోడ్డున పడ్డారు. 
 
నివేదికల ప్రకారం.. క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫి ఫైనలిస్ట్‌లు ఫన్ఖుత్వా, నార్తరన్‌ జట్లు క్లబ్‌ రోడ్డులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో బస చేస్తున్నాయి. ఈ ఆటగాళ్ల కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు డిసెంబర్‌22 వరకు మాత్రమే హోటల్‌ను బుక్‌ చేసింది. తదపరి బుకింగ్‌ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్వాన్స్ చెల్లించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, హోటల్ మేనేజ్‌మెంట్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరుగలేదు. 
 
కానీ.. పీసీబీ మాత్రం తమ బుకింగ్‌లను హోటల్‌ ధృవీకరించబడినట్లు భావించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సమాచార, సమన్వయ లోపం కారణంగా ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లగేజీతో రోడ్డు మీద వేచిచూడాల్సిన దుస్థితి వచ్చింది.