ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (22:54 IST)

సిరాజ్ 4 వికెట్లు.. పోరాడి ఓడిపోయిన పంజాబ్.. కోహ్లీ రికార్డుల పంట

Kohli
Kohli
బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్ అద్భుత ఆరంభంతో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 
 
అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో ఆడిన పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఈ దశలో గెలిచిన బెంగళూరు జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
 
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్ జట్ల కెప్టెన్‌లలో 6500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడు కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్‌మన్ విరాట్‌గా నిలిచాడు. 
 
శిఖర్ ధావన్ (730 ఫోర్లు) మొదటి స్థానంలో, ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (608 ఫోర్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.