శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (17:06 IST)

అంగట్లో ఆటగాళ్లు : ఐపీఎల్ వేలంలో రూ. కోట్లు పలికిన పాట్ కమ్మిన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు గురువారం కోల్‌కతా వేదికగా జరుగుతున్నాయి. ఈ వేలం పాటల్లో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. మొత్తం 338 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. 
 
ఈ వేలం పాటల్లోభాగంగా, ఆస్ట్రేలియాకు చెందిన పాట్‌కమ్మిన్స్‌ను కోల్‌కతా జట్టు రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. అలాగే, మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)ను రూ10.75 కోట్లకు పంజాబ్, క్రిస్ మెరిస్‌ను(దక్షిణాఫ్రికా) రూ.10 కోట్లకు బెంగళూరు, ఇయాన్ మోర్గాన్‌ను( ఇంగ్లాండ్) రూ.5.25 కోట్లకు కోల్‌కతాకు దక్కించుకున్నాయి. 
 
అలాగే, ఆరోన్ ఫించ్‌ను(ఆస్ట్రేలియా) రూ.4.40 కోట్లకు బెంగళూరు, రాబిన్ ఊతప్ప(భారత్) రూ.3 కోట్లకు రాజస్థాన్, క్రిస్‌లిన్‌ను(ఆస్ట్రేలియా) రూ.2 కోట్లకు ముంబై, జాసన్‌రాయ్‌ను(ఇంగ్లాండ్) రూ.1.50 కోట్లకు ఢిల్లీ జట్లు దక్కించుకున్నాయి. మిగిలిన ఆటగాళ్ళ వేలం పాటలు ఇంకా కొనసాగుతున్నాయి.