1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Ivr
Last Modified: మంగళవారం, 31 మార్చి 2015 (20:57 IST)

వర్మ బాటలో ఆఫీసర్ అమితాబ్... ధోనీకి లెటర్.. రూ. 1000 చెక్కు... ఎందుకు?

టీమ్ ఇండియా ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ లో ఓడిపోయినందుకు చాలా సంతోషమంటూ క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో సంబరం చేసుకున్నారు. ఇపుడలాంటిదే మరొకటి జరిగింది. కాకపోతే ఈసారి స్పందించింది ఓ పోలీస్ అధికారి. ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ టీమిండియా కెప్టెన్ ధోనీకి ఓ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఇలా పేర్కొన్నారు. వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి పాలవడం ద్వారా భారతదేశంలో అభిమానులు మరో రోజు... అంటే ఫైనల్ కు వెళితే, ఆ రోజు అతుక్కుపోకుండా కాపాడారంటూ పేర్కొన్నారు. 
 
ఈ క్రికెట్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ కర్తవ్య నిర్వహణ పక్కనపెట్టేసి సెలవులు పెట్టేస్తున్నారనీ, కాబట్టి దీనిపై కెప్టెన్ ధోనీ కల్పించుకుని క్రికెట్ పోటీలు జరిగేటపుడు ఉద్యోగులు సెలవులు పెట్టరాదని సూచించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం యూపీలో ఐజీగా పనిచేస్తున్న అమితాబ్ ఠాకూర్ తనకు క్రికెట్ అంటే ఇష్టత ప్రకటించననీ, ఎందుకంటే తను పనిని ప్రేమిస్తానని చెప్పుకున్నారు. ఐతే మరో విశేషమేమిటంటే... ఈ లేఖతో పాటు ధోనీకి రూ. 1000 చెక్కును కూడా పంపారు. మరి ఇది ఎందుకు పంపారో తెలియాల్సి ఉంది.