మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (20:45 IST)

ఇషాంత్ శ‌ర్మకు అమ్మాయి పుట్టిందోచ్..

Ishant Sharma
టీమిండియా క్రికెటర్ సీనియ‌ర్‌ ఫాస్ట్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ తండ్రి అయ్యాడు. అత‌డి భార్య ప్ర‌తిమా సింగ్ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇషాంత్ శ‌ర్మ దంపతులకు ఇది తొలి సంతానం. 
 
ఈ సంతోషకరమైన విషయాన్ని ఇషాంత్ సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. దీంతో సినీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఇషాంత్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.
 
కాగా ఇషాంత్ శర్మ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్ర‌తిమ‌ను 2016లో వివాహం చేసుకున్నాడు. ఇకపోతే.. ఇషాంత్ శర్మ టీమిండియా త‌ర‌ఫున 105 టెస్టులు, 80 వ‌న్డేలు, 14 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్ల‌లో కలిపి 434 వికెట్లు పడగొట్టాడు.