జేమ్స్ అండర్సన్ సూపర్ బౌలింగ్.. ఆ రికార్డ్ బ్రేక్
ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. విశాఖపట్నం వేదికగా టీమిండియా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ వెటరన్ పేసర్ మూడు వికెట్లతో తన సత్తా ఏంటో చాటుకున్నాడు.
ఈ క్రమంలో భారత గడ్డపై ఓ రేర్ ఫీట్‌ను సాధించాడు. ఇండియాలో టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ లాల్ అమర్‌నాథ్ పేరిట ఉన్న 72 ఏళ్ల రికార్డును అండర్సన్ బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం జరుగుతున్న వైజాగ్ టెస్టు నాటికి అండర్సన్ వయసు 41 సంవత్సరాల 187 రోజులు. 1952లో అమర్‌నాథ్ 41 ఏళ్ల 92 రోజుల వయసులో దాయాది పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. తాజాగా అమర్ నాథ్ రికార్డును అండర్సన్ బ్రేక్ చేశాడు.
రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.