Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చనిపోయే లోపైనా మనవడిని ముద్దాడాలని వుంది.. ఆ క్రికెటర్ తాత

మంగళవారం, 4 జులై 2017 (08:56 IST)

Widgets Magazine
jasprit bumrah

'అపుడు నేను చేసిన తప్పు క్షమించరానిదే. ఇపుడు చేసిన తప్పు ఎంత పెద్దదో తెలుసుకున్నా. నేను చనిపోయే లోపు నా మనవడిని దగ్గరకు తీసుకుని ముద్దాడాలని ఉంది' అంటూ 84 యేళ్ళ వృద్ధుడు వాపోతున్నారు. అతను ముద్దాడాలనుకున్నది టీమిండియా క్రికెటర్లలో ఓ క్రికెటర్‌ను. ఆ క్రికెటర్.. ఆ తాత ఎవరన్నదే కదా మీ సందేహం. అయితే ఈ కథనం చదవండి. 
 
అతని పేరు సంతోఖ్ సింగ్. వయసు 84 యేళ్లు. ఉత్తరాఖండ్‌‌లోని ఉధంసింగ్‌ నగర్‌ జిల్లా కిచ్చా పట్టణవాసి. ఈయన మనవడు జస్పీత్‌ బుమ్రా. భారత క్రికెట్ జట్టు పేసర్. ఈ క్రికెటర్‌కు వృద్ధుడికి మధ్య ఉన్న సంబంధమేంటో పరిశీలిద్ధాం. సంతోఖ్‌ సింగ్‌ కొడుకు జస్బీర్‌ సింగ్‌ కుమారుడే జస్పీత్ బుమ్రా. అంటే స్వయాన తాత. అయితే 2001లో బుమ్రా తండ్రి జస్బీర్‌ సింగ్‌ మరణించాడు. కానీ అప్పుడు బుమ్రాను అతడి తల్లి దల్జీత్‌సింగ్‌ను సంతోఖ్‌ సింగ్‌ తనవద్ద ఉంచుకోలేదు. ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఆనాడు తాను చేసిన పనికి ఆమె ఎంతో కుమిలిపోయి ఉంటుందని సంతోఖ్ సింగ్ ప్రశ్చాత్తాపడుతున్నాడు. 
 
ఇదిలావుంటే, సంతోఖ్‌ సింగ్‌ దశాబ్దం కిందట అహ్మదాబాద్‌ నుంచి జీవనోపాధి కోసం కిచ్చా వచ్చాడు. అప్పట్లో ఆటోల బిజినెస్‌ చేశాడు కానీ దాంట్లో నష్టాలు రావడంతో.. తానే ఆటో డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. 2010లో సంతోఖ్‌ భార్య చనిపోయింది. ప్రస్తుతం ఓ గదిలో ఉంటున్న బుమ్రా తాత.. ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. అహ్మదాబాద్‌లో నివసించే బుమ్రాను ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఉవ్విళ్లూరుతున్నాడు. కనీసం చనిపోయే లోపైనా మనవడిని చూడాలని ఆరాటపడుతున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మహిళా క్రికెట్లో మెరుస్తున్న మణి దీపం స్మృతి మంధన

భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్‌ ...

news

కోహ్లీని మించిపోతున్న రహానే.. భవిష్యత్ కెప్టెన్ అతడేనా.. స్మిత్ మాటలే నిజమయ్యేనా?

టీమిండియా తరపున ఎన్ని మ్యాచ్‌లు ఆడినా రాని గుర్తింపు ఒక విదేశీ కెప్టెన్ ఆత్మీయ ప్రశంసలతో ...

news

ధోనీని ఇలా ఎన్నడైనా చూశామా? ‘ఎక్స్‌పైరీ డేట్‌’కు చేరువైనట్లేనా?

ఓటమి తప్పదనిపించిన మ్యాచ్‌లను విజయాలతో ముగించడంతో అల్లుకుపోయిన పేరు తనది. అతనుంటే చాలు ...

news

సచిన్ - ద్రవిడ్ రికార్డులకు అడుగు దూరంలో అజింక్యా రహానే

భారత క్రికెట్ లెజెండ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను సమం చేసేందుకు ఓ ...

Widgets Magazine