Jasprit Bumrah: ఐపీఎల్‌కు అందుబాటులో జస్ప్రీత్ బుమ్రా!!
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ జస్స్రీత్ బూమ్రా ఫిట్నెస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న బుమ్రా... తన ఫిట్నెస్‌కు సంబంధించిన కీలక వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు.
తాను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ మేరకు తన ఫిట్నెస్‌పై బుమ్రా గురువారం నాడు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోను చూసిన ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 22వ తేదీ నుంచి స్వదేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెల్సిందే.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో తప్పుకున్న విషయం తెల్సిందే. ఈ టెస్ట్ సిరీస్ ఆఖరి టెస్టులో వెన్ను నొప్పితో మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించాడు. వెన్నునొప్పి గాయానికి ఆయన ప్రస్తుతం ఎన్.సి.ఏలో వ్యాయామాలు చేస్తూ తన ఫిట్నెస్‌ను మెరుగుపరుచుకుంటున్నారు.