గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (12:14 IST)

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్.. అదే నా చివరి మ్యాచ్.. రిటైర్ అవుతున్నా.. మెస్సీ

ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ తో తాను రిటైర్ అవుతానని లియోనెల్ మెస్సీ ధృవీకరించాడు. అర్జెంటీనా, క్రొయేషియా జట్టుపై 3-0 తేడాతో విజయం సాధించి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు అర్హత సాధించింది.
 
ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ తో డిసెంబర్ 18న రిటైర్ అవుతానని మెస్సీ ప్రకటించాడు. అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ అయిన మెస్సీ అర్టెంటీనా జట్టును ఫైనల్లోకి తీసుకెళ్లాడు. 
 
ఇంకా అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మెస్సీ 11 గోల్స్ సాధించాడు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. ఈ ఉన్నత స్థానానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా వుందని తెలిపాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ తన చివరి మ్యాచ్ అంటూ ధ్రువీకరించాడు. 35 ఏళ్ల ఫెదరర్ తన ఐదవ ప్రపంచ కప్ లో ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీని ఫ్యాన్స్ ధోనీతో పోల్చుతున్నారు.