శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (10:38 IST)

టీమిండియా ఆటగాళ్లకు గ్రిల్డ్ చికెన్ వద్దు.. కడక్‌నాథ్ చికెన్ ఇవ్వండి..

టీమిండియా ఆటగాళ్ల ఆహారంలో ఝాబాస్ కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చాలని మధ్యప్రదేశ్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రం, ఝాబా (కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్) లేఖలు రాసింది. ఈ మేరకు బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ కోహ్లీలకు కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్ లేఖలు రాసింది. టీమిండియా డైట్‌లో గ్రిల్ల్‌డ్ చికెన్ ఉంటోందని, అందులో కొలెస్ట్రాల్, ఫ్యాట్ అధికశాతంలో ఉంటాయని పేర్కొంది. 
 
అదే కడక్‌నాథ్ బ్లాక్ చికెన్‌లో కొలెస్ట్రాల్ వుండదని పేర్కొంది. ఇది ఆటగాళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఈ చికెన్‌లో ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా వుంటాయని చెప్పుకొచ్చింది. అందుచేత సాధారణ చికెన్ స్థానంలో కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చాలని కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్ విజ్ఞప్తి చేసింది. ఈ చికెన్ తీసుకోవడం ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ఢోకా వుండదని సదరు సంస్థ ఆ లేఖలో వెల్లడించింది.