Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిఖర్ ధావన్ 100.. కోహ్లీ 75 పరుగులకే అవుట్.. అయినా రికార్డుల పంట

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (19:16 IST)

Widgets Magazine

దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 13 బంతుల్లో ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు. రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం సెంచరీ బాదాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
 
శిఖర్ ధావన్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ చక్కని భాగస్వామ్యం ఇచ్చాడు. అంతేగాకుండా కొత్త రికార్డును కూడా సృష్టించాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అర్థ సెంచరీని పూర్తి చేయడం ద్వారా దక్షిణాఫ్రికాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 350 పరుగులకి పైగా సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. అలాగే ఈ వన్డేలో మరో రికార్డు కూడా నమోదైంది. 
 
రెండో వికెట్‌కు కోహ్లీ-ధవాన్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పటం ఇది ఎనిమిదోసారి. అయితే ధీటుగా ఆడిన శిఖర్ ధావన్ శతకంతో భారత స్కోరును పరుగులెత్తించాడు. 99 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన వన్డే కెరీర్‌‌లో 13వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ  కూడా సెంచరీ దిశగా బ్యాటింగ్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం సెంచరీని చేజార్చుకున్నాడు. 
 
సెంచరీ దిశగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ 83 బంతులాడి ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు సాధించాడు. మోరిస్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయ్యాడు. దీంతో 34.2 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది. ప్రస్తుతం ధావన్ (107), రహానే (5) క్రీజులో వున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, మోరిస్ చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
శిఖర్ ధావన్ కోహ్లీ సెంచరీ Kohli Johannesburg Shikhar Dhawan 4th Odi Live Cricket Score India Vs South Africa 2018

Loading comments ...

క్రికెట్

news

సారా టెండూల్కర్ పేరుతో నకిలీ ఖాతా... ఏం చేశారో తెలుసా?

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ...

news

మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్న క్రికెటర్...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్నాడు. అది ...

news

సఫారీలను చితక్కొట్టిన విరాట్ కోహ్లీ : మూడో వన్డేలో విజయభేరీ

సఫారీ గడ్డపై భారత క్రికెటర్లు సింహాల్లో గర్జిస్తున్నారు. ఆతిథ్య జట్టును ...

news

పాక్ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా : రాహుల్ ద్రావిడ్

అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూంకు వెళ్లి వారితో ...

Widgets Magazine