గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (10:40 IST)

పెళ్లి పీటలు ఎక్కబోతున్న రుతురాజ్ గైక్వాడ్.. అమ్మాయి గురించి..?

Ruturaj Gaikwad
Ruturaj Gaikwad
చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ యువ ఓపెనర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 
 
తాను చేసుకోబోయే అమ్మాయిని అందరికీ పరిచయం చేశాడు. ఐపీఎల్ ట్రోఫీతో ఇద్దరూ ఫోటోలకు ఫోజు ఇచ్చారు. వీరి మధ్య రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోంది.
 
రుతురాజ్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఉత్కర్ష అమర్ పవార్. సొంతూరు పూణే. ఆమె కూడా క్రికెట‌ర్ కావడం విశేషం. ఉత్కర్ష పదకొండేళ్ల వ‌య‌సు నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. 
 
పేస్ బౌల‌ర్ అయిన ఉత్క‌ర్ష మ‌హ‌రాష్ట్ర మ‌హిళా క్రికెట్ జట్టు తరఫున ఆడింది. దేశవాళీలో 10 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు ప‌డ‌గొట్టింది.