Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియా కుర్రోళ్ళు చెత్తగా ఆడుతున్నారు... : హర్భజన్ సింగ్

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (17:17 IST)

Widgets Magazine
Harbhajan Singh

భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని సభ్యుల ఆటతీరుపై భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కంగారుల ఆటతీరు పేలవంగా ఉందని భజ్జీ అభిప్రాయపడ్డారు. 
 
భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలు కావడంతో ఆ జట్టుపై విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో దిగ్గజంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టేనా ఇది? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
దీనిపై భజ్జీ స్పందిస్తూ, 'మైకేల్ క్లార్క్, నువ్వు తిరిగి ఆటను ప్రారంభించాలని నేను కొరుకుంటున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రతిభగల బ్యాట్స్‌మన్ రాక తగ్గింది' అన్నాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్‌లో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ లేరన్నారు. అందుకే రిటైర్మెంట్‌ కి విరామం ప్రకటించి ప్రస్తుత ఆసీస్‌ జట్టులో మళ్లీ నువ్వు చేరాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపాడు. 
 
కాగా, ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్న క్లార్క్ కెరీర్ పీక్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌తో సిరీస్‌కు వ్యాఖ్యాతగా క్లార్క్ వ్యవహరిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పాండ్యా ప్రమోషన్‌కు రవిశాస్త్రి కిటుకేనట.. : విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టుకు మరో కపిల్‌దేవ్‌ దొరికాడంటూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ ...

news

కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు.. ధోనీ, రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు..

వరుసగా అత్యధిక వన్డేల్లో జట్టును గెలిపించిన సారథిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ...

news

సిరీస్ టీమిండియాదే.. ఇండోర్ వన్డేలో ఆసీస్ చిత్తు...

సొంతగడ్డపై టీమిండియా సింహంలా గర్జించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మరో ...

news

ఇండోర్ వన్డే: ఫించ్ సెంచరీ... భారత్ టార్గెట్ 294 పరుగులు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ...

Widgets Magazine