శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:10 IST)

శ్రీలంక క్రికెట్ జట్టులో కరోనా కలకలం.. కోచ్, లహిరుకు కోవిడ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఇంకా తగ్గలేదు. తాజాగా శ్రీలంక క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
లంక ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్, బ్యాట్స్‌మన్‌ లహిరు తిరుమానెకు కరోనా సోకిందని ఆదేశ క్రికెట్‌ బోర్డు బుధవారం వెల్లడించింది. ఈనెల చివర్లో లంక టీమ్‌ వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.
 
ఈ టూర్‌కు ముందు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి వైరస్‌ సోకడంతో పర్యటనను రీ షెడ్యూల్‌ చేసే అవకాశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. విండీస్‌, లంక మధ్య సిరీస్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. ఈ పర్యటనలో శ్రీలంక రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.