Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెనక్కి తగ్గని మిథాలీ... jfW కవర్ పేజీపై ఇలా(ఫోటోలు)

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (22:01 IST)

Widgets Magazine

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నా ఆమె ఎంతమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఈసారి ఏకంగా జస్ట్ ఫర్ ఉమెన్(JFW) పత్రిక కవర్ పేజీపై ఫోజిచ్చేసింది. ఇక లోపల ఏ స్థాయిలో ఫోటోలు వుంటాయో చెప్పక్కర్లేదు. మొత్తమ్మీద నెటిజన్లు సంధించే ట్వీట్లను ఆమె ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదని స్పష్టమవుతోంది.
MithaliRaj
 
ఇటీవలే ఆమె వేసుకున్న దుస్తులపై.... మిథాలీ.. నీకు మతిపోయిందా? ఆ డ్రెస్ ఏంటి? అంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు నెటిజన్లు. మిథాలీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో ఆమె వస్త్రధారణ సరిగా లేదంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఆమె తీరును తప్పుబడుతున్నారు. అయితే ఆమెను విమర్శించిన వారికి అంతే స్థాయిలో ఆమె ఫాలోవర్లు కౌంటరిస్తున్నారు. ఇలాంటి సంకుచిత మనస్తత్వాన్ని ఇకనైనా వీడాలంటూ పిలుపునిస్తున్నారు.
 
'నీ ఆలోచనను మార్చు.. దేశాన్ని మార్చు' అనే నినాదాన్ని వినిపిస్తున్నారు. మిథాలీ ఫొటోను వ్యతిరేకించిన వారి కంటే.. ఆమెకు మద్దతుగా నిలిచిన వారే ఎక్కువగా ఉండటం ఇక్కడ విశేషం. టీమిండియా మహిళా కెప్టెన్‌గా ఆమె సాధించిన విజయాలను చూడకుండా.. ఇలా నీచమైన కామెంట్లు చేసి వారి అసలు మనస్తత్వాన్ని బయటపెట్టుకోవద్దని నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి మిథాలీ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. 
MithaliRaj
 
కాగా, ఇలా సెలబ్రెటీల డ్రెస్సింగ్‌పై వ్యతిరేకత రావడం ఇవాళ కొత్తేమీ కాదు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా ధరించిన వస్త్రాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు ఆమెపై విరుచుకుపడగా, వాటికి ఆమె ధీటుగా కౌంటర్ ఇచ్చిన విషయం తెల్సిందే.
 
అలాగే బుల్లితెర యాంకర్ అనసూయ, రేష్మీ, కలెక్టర్ అమ్రపాలి ఇలా పలువురి వస్త్రధారణపై కొందరు విమర్శలు చేశారు. అయితే వృత్తిపరమైన జీవితాన్ని... వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి చూడొద్దని... వారిపై తప్పుడు కామెంట్స్ చేయొద్దని వీరంతా ధీటుగా కొందరు బదులిచ్చారు. అయినప్పటికీ.. ఈ విమర్శలు ఎదుర్కొంటున్న వారి జాబితాలోకి తాజాగా టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఇపుడు చేరడం గమనార్హం.
mithali rajWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కఠినంగా ప్రాక్టీస్ చేస్తే.. మరో పదేళ్లే కెరీర్‌ను కొనసాగిస్తా: విరాట్ కోహ్లీ

తాను కనుక ఫిట్‌గా వుంటే మరో పదేళ్లు తన కెరీర్‌ను కొనసాగిస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ ...

news

చదువుల్లో మంచి స్కోర్ చేయలేకపోయానంటున్న క్రికెట్ దిగ్గజం!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చదువుపై ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దీనికి ఓ ఫోటో జత ...

news

బయటపడిన కోహ్లీ వక్రబుద్ధి... నెటిజన్ల మండిపాటు.. ఎందుకు?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనలోని వక్రబుద్ధిని బహిర్గతం చేశారంటూ ...

news

మిథాలీ నీకు మతిపోయిందా? ఆ డ్రెస్ ఏంటి? నిలదీసిన నెటిజన్లు...

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్లు విమర్శలు ...

Widgets Magazine