శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (13:17 IST)

హైదరాబాద్‌లో భారీ కటౌట్‌లు: మహమ్మద్ సిరాజ్ లిప్స్‌ మీద వేలేస్తే!?

Siraj
ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టులో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన కోహ్లీసేన 2014 తర్వాత క్రికెట్ పుట్టినిళ్లు లార్ట్స్ మైదానంలో భారత్ జయభేరి మోగించాడు. 
 
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ అప్పుడు విజయాన్ని అందుకుంది. ఇక లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరోసారి సిరాజ్ హీరో అయ్యాడు.
 
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో ఓపెనర్ డామ్ సిబ్లీ, హసీబ్ హమీద్‌ను పెవిలియన్ చేర్చిన మొహ్మద్ సిరాజ్.. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన జానీ బెయిరిస్టో‌, ఓలీ రాబిన్సన్‌ను ఔట్ చేశాడు. 
 
ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస బంతుల్లో కీలక మొయిన్ అలీ, సామ్ కరన్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత భారత విజయానికి అడ్డుగా నిలిచిన జోస్ బట్లర్, జేమ్స్‌ అండరన్సన్‌ను ఓకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చి టీమిండియా విజయాన్ని లాంఛనం చేశాడు. ఒకానొక సమయంలో డ్రా దిశగా సాగుతున్న మ్యాచులో భారత్ గెలిచిందంటే.. అంత సిరాజ్ మహిమే అని చెప్పాలి.