సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (20:18 IST)

'భారత్'గా దేశం పేరు.. మహేంద్ర సింగ్ ధోనీ మద్దతిస్తున్నారా?

Dhoni
దేశం పేరును 'భారత్'గా మార్చే విషయానికి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోనీ దానికి మద్దతుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కూల్ కెప్టెన్ ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్‌లో, 'నేను భారతీయుడిగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాను' అనే క్యాప్షన్ ఇస్తూ పోస్టు చేశారు. ఇందులో వాస్తవం ఏమిటంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన ప్రొఫైల్ చిత్రంగా దీన్ని పోస్ట్ చేశారు. 
 
ఈ ఫోటోకు పలు అర్థాలు పోస్టు చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ధోనీ భారత్ అని దేశం పేరు మారే అంశంపై మద్దతిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే.. ఆగస్టు 15 నుంచి ధోనీ తన ఇన్‌స్టా ఫోటోను మార్చకపోవడం గమనార్హం.