శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:18 IST)

సచిన్ తర్వాత ధోనీనే.. 504 మ్యాచ్‌లతో క్రికెట్ దేవుడి సరసన..

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా సూపర్ 4లో మంగళవారం ఆప్ఘన్‌తో జరిగే వన్డే మ్యాచ్.. ధోనీ కెరీర్‌లో 504వది కావడం విశేషం. 
 
తద్వారా సచిన్ తర్వాత ధోనీ నిలిచాడు. ఇక అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రావిడ్‌ (504) మ్యాచులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ధోనీ ఇవాల్టి మ్యాచ్ ద్వారా సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 
 
ఇకపోతే ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ద్రావిడ్‌ను అధిగమిస్తాడు. కాగా ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.