శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (12:21 IST)

ఛారిటీ మ్యాచ్‌లో ఆడనున్న ధోనీ.. బీసీసీఐ ఇలా చేయడం ఇదే తొలిసారి..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. చాలాకాలం తర్వాత ధోనీ తిరిగి క్రికెట్ బ్యాట్ పట్టనున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక ఛారిటీ మ్యాచ్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మ్యాచ్‌తోనే ధోనీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ చారిటీ మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
ఈ మ్యాచ్‌లో నార్త్, ఈస్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌) టీమ్‌లు ఒక జట్టు గానూ.. సౌత్, వెస్ట్ (చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్) టీమ్‌లు మరో జట్టుగా కలిసి ఆడనున్నాయని సమాచారం. గుజరాత్‌లో నిర్మించిన అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో జరుగుతుందని టాక్. 
 
ఈ మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్లంతా ఒకే టీమ్ తరపున ఆడటం.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, డివిలియర్స్, షేన్ వాట్సన్, బుమ్రా, మలింగా వంటి స్టార్ ప్లేయర్లు ఒకే టీమ్ తరపున ఆడనున్నారు.