Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ధోనీలో ఆ సత్తా ఉంది.. 2019 ప్రపంచకప్ తర్వాత చెప్పలేం: మైక్ హస్సీ

బుధవారం, 16 ఆగస్టు 2017 (14:21 IST)

Widgets Magazine

2019 ప్రపంచ కప్ వరకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో కొనసాగుతారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ జట్టులో ట్వంటీ-20, 50 ఓవర్లు, ఛాంపియన్స్ ట్రోఫీ కప్‌లు సాధించిపెట్టిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. ధోనీకి ప్రస్తుతం 36ఏళ్లు. ఇప్పటికే తనపై వెల్లువెత్తిన విమర్శలతో సంప్రదాయ టెస్టులకు స్వస్తి పలికిన ధోనీ.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. 
 
తాజాగా ధోనీ జట్టులో కొనసాగేందుకు ఫిట్‌గా వున్నాడా? 2019 ప్రపంచ కప్ వరకు ధోనీ జట్టులో స్థానం దక్కించుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా 2019 ప్రపంచకప్ వరకు ధోనీ ఫిట్‌నెస్ సరిగ్గా వుంటుందా అని విమర్శకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ విమర్శలకు ధోనీ ధీటుగా సమాధానమిచ్చారు. 20 మీటర్ల దూరాన్ని 2.91 సెకన్లలో అధిగమించానని చెప్పాడు. అంతేగాకుండా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ధోనీకి మద్దతు పలికాడు. 2019 ప్రపంచ కప్ పోటీల్లో ధోనీ అద్భుతంగా రాణిస్తాడని తెలిపాడు. అయితే ప్రపంచకప్ ఆడేనాటికి ధోనీకి 38 ఏళ్లు పూర్తవుతాయని.. ఆపై ఆయన టీమిండియా క్రికెట్ జట్టు నుంచి తప్పుకుని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని హస్సీ అనుమానం వ్యక్తం చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

విశ్రాంతి పేరుతో యువరాజ్‌ ఔట్... నెక్ట్స్ టార్గెట్ ధోనీయేనా?

భారత క్రికెట్ జట్టు నుంచి యువరాజ్ సింగ్‌ను తప్పించారు. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు ...

news

శ్రీలంకను వైట్ వాష్ చేసిన టీమిండియా: ఇన్నింగ్స్, 171 పరుగుల తేడాతో చారిత్రక విజయం

భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మూడో, చివరి టెస్టులో భారత జట్టు విజయం సాధించడం ద్వారా ...

news

చరిత్ర సృష్టించిన భారత్.. 85 యేళ్ల టెస్ట్ హిస్టరీలో... హేమాహేమీలకు సాధ్యంకానిది...

కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 85 యేళ్ళ ...

news

6 బంతులు.. 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్.. అత్యంత అరుదైన రికార్డు

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు. ...

Widgets Magazine