Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రికెట్‌లో ఫోర్లు - సిక్స్‌లే కాదు.. ఎయిట్స్ కూడా ఉండాలని.. ధోనీ నయా ఐడియా

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (13:52 IST)

Widgets Magazine
ms dhoni

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాడు. మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను బంతి దాటితే ఇస్తున్న ఫోర్, సిక్స్‌లకు అదనంగా ఎయిట్ (8)ను కూడా చేర్చాలని అన్నాడు. బంతి స్టేడియం బయట పడితే ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందనే సరికొత్త అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 
 
ప్రస్తుతం జరుతున్న ఐపీఎల్ పదకొండో సీజన్ పోటీల్లో భాగంగా, మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత పసులు జెర్సీ వేసుకుని సీఎస్కే జట్టుకు ధోనీ నాయకత్వం వహించాడు. 
 
ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే జట్టు సులభంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్స్‌లు నమోదు కాగా, కొన్ని బంతులు స్టేడియం బయటకు వెళ్లిపోయాయి కూడా. ఇక ప్రజెంటేషన్ సమయంలో మాట్లాడిన ధోనీ బంతి బయట పడితే ఆరు పరుగులకు బదులుగా ఎనిమిది పరుగులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది ఇపుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

షమీతో కాపురం చేయలేను.. నెలకు రూ.10 లక్షలు భరణం చెల్లించాలి... జహాన్

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీకి ఆయన భార్య నుంచి మొదలైన సమస్య ఇప్పట్లో ...

news

ఐపీఎల్‌కు కావేరి సెగ: మ్యాచ్ జరిగితే.. స్టేడియంలో పాములు వదులుతాం..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు ...

news

ఐపీఎల్ 2018 : సొంతగడ్డపై ధనాధన్ ధావన్.. సన్‌రైజర్స్ విక్టరీ

ఇండియన్ ప్రీమయర్ లీగ్ 11వ అంచ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో ...

news

ఐపీఎల్‌ను తాకిన కావేరి సెగ.. చెన్నై టీమ్‌కు కష్టాలు తప్పవా?

కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ...

Widgets Magazine