Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముత్తయ్య, ఎంజీఆర్‌లకు మోడీ కితాబు.. శ్రీలంకకు భారత్ పెద్దన్న లాంటివాడన్న స్పిన్నర్..

ఆదివారం, 14 మే 2017 (14:43 IST)

Widgets Magazine
narendra modi

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు గుప్పించారు. తమిళజాతి ఆణిముత్యం ముత్తయ్య మురళీధరన్ అంటూ మోడీ కొనియాడారు. దీనిపై స్పిన్నర్ కూడా స్పందించారు.

తన సందేశంలో నరేంద్ర మోడీ లాంటి గొప్ప నేత తన పేరు పలకడం గొప్ప అనుభూతి అని మురళీధరన్ అన్నాడు. 
 
శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం డికోయా నగరంలో తమిళ ప్రజలను కలుసుకున్న నరేంద్ర మోడీ.. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంలోనే మురళీధరన్‌ను, దివంగత ఎంజీఆర్‌ను తమిళజాతి ఆణిముత్యాలుగా మోడీ కీర్తించారు. ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న మురళీధరన్.. ఐపీఎల్ పదో సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నారు. 
 
శనివారం మీడియాతో మాట్లాడిన మురళీ.. మోడీ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌. అలాంటి దేశాన్ని నడిపిస్తోన్న నేత(మోడీ).. శ్రీలంకలో మా(తమిళ) కమ్యూనిటీని గురించి మాట్లాడటం గొప్పవిషయమని మురళీ తెలిపారు. శ్రీలంకకు భారత్ పెద్దన్నలాంటిదని, ఇరు దేశాలది గాఢానుబంధమని గుర్తుచేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది? కర్రల సాయంతో బీబర్ షోకు వచ్చాడేంటి?

క్రికెట్ దేవుడు, టీమిండియా స్టార్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు ...

news

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భలే గిరాకీ, హాటు కేకుల్లా టిక్కెట్లు.. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ ...

news

టీమిండియా కోహ్లీపై ఆధారపడలేదు.. ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయొద్దు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వివాదాస్పద ...

news

ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు ...

Widgets Magazine