గురువారం, 31 జులై 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (19:03 IST)

భారత్ 300 చేస్తుందని అనుకున్నాను.. చేసింది: అమితాబ్ బచ్చన్

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించడం గర్వంగా ఉందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ‘కపిల్, అక్తర్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలతో కలిసి కామెంటరీ చెప్పడం గర్వంగా ఉంది. భారత్ 300 చేస్తుందని అనుకున్నాను. చేసింది' అని అమితాబ్ భారత ఇన్నింగ్స్ ముగిశాక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
 
అలాగే జాతీయ గీతం 'జనగణమన' విన్నప్పుడల్లా భావోద్వేగానికి లోనవుతానని, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్‌ ముందు ఇరు దేశాలు జాతీయ గీతాలాపన ఏర్పాటు చేయడాన్ని 72 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ప్రశంసించాడు. ఇక ఆదివారం నాడు అడిలైడ్‌లో జరిగిన భారత్, పాకిస్ధాన్ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఆకట్టుకున్నారు. 
 
కెరీర్, వృత్తి ముఖ్యంగా భావించే మీరు క్రికెట్ వ్యాఖ్యానానికి వచ్చారని అంటే, దేశం కోసం క్రీడాకారులు ఆడుతున్నప్పుడు ఆ మాత్రం బాధ్యతగా ఉండడం అవసరమని అమితాబ్ అన్నారు.