గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (18:21 IST)

ఐసీసీ వరల్డ్ కప్ : కుప్పకూలిన బంగ్లాదేశ్ - కివీస్‌కు స్వల్ప టార్గెట్

new zealand -bangla
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శుక్రవారం బంగ్లాదేశ్ - న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కివీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కివీస్ ముంగిట 246 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు ఆశలకు గండిపడింది.
 
బంగ్లా వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ (66), కెప్టెన్ షకీబల్ హాసన్ (40), మహ్మదుల్లా (41 నాటౌట్)లు మాత్రమే రాణించారు. మిగిలిన ఆటగాళ్ళంతా చేతులెత్తేశారు. దీంతో బంగ్లాదేశ్ ఆమాత్రం స్కోరునైనా చేయగలిగింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గూసన్‌, మాట్ హెన్రీల నాణ్యమైన బంతులను ఎదుర్కోవడంలో బంగ్లా ఆటగాళ్లు పూర్తిగా తడబడ్డారు. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3, బౌల్ట్ 2, మాట్ హెన్రీ 2, శాంట్నర్, ఫిలిప్స్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.