శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (10:09 IST)

ఓ యువతిని చేయి పట్టుకొని లాగాడు.. నిర్భయ కేసు పెట్టారు!

లీగ్ క్రికెట్ క్రీడాకారుడిపై జూబ్లీహిల్స్ పోలీసుల నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ యువతి చేయిపట్టుకుని లాగి.. అసభ్యంగా ప్రవర్తించిన అతనిపై నిర్భయ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

లీగ్ క్రికెట్ క్రీడాకారుడిపై జూబ్లీహిల్స్ పోలీసుల నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ యువతి చేయిపట్టుకుని లాగి.. అసభ్యంగా ప్రవర్తించిన అతనిపై నిర్భయ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 38కి చెందిన సరితకు నాలుగేళ్లుగా మాసబ్‌ ట్యాంకుకు చెందిన మహేష్‌తో పరిచయం ఉంది.
 
లీగ్ స్థాయి క్రికెట్ క్రీడాకారుడైన ఇతడు.. ఈ నెల 17న ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సరితను కలిశాడు. ఈ సమయంలో ఆమె చెయ్యి పట్టుకొని లాగడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా లీగ్ క్రికెటర్‌పై నిర్భయ చట్టం ప్రయోగించారు.