మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (13:43 IST)

కోహ్లీని ''స్వీపర్'' అన్న ఆస్ట్రేలియా మీడియా.. ఏకిపారేసిన పాక్ ఫ్యాన్స్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాకిస్థానీయులు అండగా నిలబడ్డారు. కోహ్లీ తాజాగా చేసిన పోస్టులకు ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తిపోసింది. గత కొన్నినెలల క్రితం ఆస్ట్రేలియా భారత్‌లో సిరీస్ ఆడిన సందర్భంగా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పాకిస్థానీయులు అండగా నిలబడ్డారు. కోహ్లీ తాజాగా చేసిన పోస్టులకు ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తిపోసింది. గత కొన్నినెలల క్రితం ఆస్ట్రేలియా భారత్‌లో సిరీస్ ఆడిన సందర్భంగా కోహ్లీని ఆ దేశ మీడియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చింది. త్వరలో ఆసీస్ సేనతో కోహ్లీ టీమ్ సిరిసీ ఆడనుంది.

ఈ నేపథ్యంలో ఆసీస్ మీడియా కోహ్లీని వదిలిపెట్టలేదు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా కోహ్లీ తీసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టులను హైలైట్ చేసిన ఆసీస్ మీడియా కోహ్లీని స్వీపర్‌గా పేర్కొంది.  
 
ఇంకా లాహోర్‌లో పాకిస్థాన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో కోహ్లీ ఇలా స్టేడియాన్ని శుభ్రపరుస్తున్నాడని ఆసీస్ మీడియా ఎద్దేవా చేసింది. దీనిపై కోహ్లీ పాకిస్థాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కోహ్లీకి మద్దతుగా ఆసీస్ క్రికెట్ జట్టును, ఆసీస్ జర్నలిస్టులను వెక్కిరిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ టెస్టుల్లో ఐద‌వ స్థానంలో ఉంటే భార‌త క్రికెట్ టీమ్ అగ్ర‌స్థానంలో ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. అలా టెస్టులో అగ్రస్థానంలో వున్న స్వీప‌ర్లు (కోహ్లీ టీమ్) కంటే ఆసీస్ కింది స్థాయిలో వుందని సెటైర్లు వేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇంతేకాకుండా కోహ్లీకి మద్దతుగా పాకిస్థాన్‌లో ట్వీట్ వెల్లువెత్తుతున్నాయి.