1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (12:04 IST)

నా భర్త నడిచే దేవుడు... క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి

తన భర్త శ్రీశాంత్ తప్పు చేశాడనీ ఆ భగవంతుడే దిగివచ్చి చెప్పినా తాను నమ్మబోనని ఆయన సతీమణి భువనేశ్వరి చెపుతోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో శ్రీపై నమోదు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిరూపితం కాలేదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్‌తో పాటు.. ఆరోపణలు ఎదుర్కొన్న క్రికెటర్లందరినీ ఢిల్లీ పాటియాలా కోర్టు నిర్దోషులుగా ఇటీవల విడుదల చేసిన విషయం తెల్సిందే. దీనిపై శ్రీ సతీమణి భువనేశ్వరి స్పందిస్తూ.. 
 
శ్రీశాంత్‌లో అందరికీ దూకుడైన స్వభావమే కనబడుతోందని, అతనిలోని అసలైన మనిషిని మాత్రం చూడడం లేదని వాపోయింది. ‘శ్రీపై మోపిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాదని నాకు తెలుసు. భగవంతుడు దిగొచ్చి అతను తప్పు చేశాడన్నా నేను నమ్మను. నేను చూసిన వారిలో శ్రీ అద్భుతమైన మనిషి. అతను నడిచే దేవుడన్నది నా నమ్మకం. ప్రజలు శ్రీలోని నిజమైన పార్శ్వాన్ని చూడడం లేద’ని చెప్పుకొచ్చింది.