శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (17:16 IST)

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016గా రవిచంద్రన్ అశ్విన్

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్.. 2016 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనందుకు గ్యారీఫీల్డ్

ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2016గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్.. 2016 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనందుకు గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 2004లో రాహుల్ ద్రవిడ్ ఒకే ఏడాది రెండు అవార్డులు గెలుచుకున్న రెండో భారత క్రికెటర్ అశ్విన్ నిలిచాడు. 
 
సోబర్స్ ట్రోఫీ గెలుచుకున్నవారిలో 2004లో ద్రవిడ్, 2010లో సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించారు. టీమిండియా తరపున మూడో వాడిగా అశ్విన్ ఈ రికార్డుకెక్కాడు. 2015 సెప్టెంబర్ 14 నుంచి 2016 సెప్టెంబర్ 20 మధ్య కాలంలో జరిగిన ఓటింగ్‌లో అశ్విన్‌కే ఓట్లు అధిక ఓట్లు పడ్డాయి. ఈ సమయంలో 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 48 వికెట్లు తీయడమే కాకుండా 336 పరుగులు సాధించాడు. 19 టి20 మ్యాచ్‌లలో 27 వికెట్లు సాధించాడు. 
 
ఇక.. ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఎంపికయ్యాడు. కుక్‌తో టెస్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌గా ఎంపికయ్యాడు. కీపర్‌గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12వ ఆటగాడిగా ఐసీసీ ఎంపిక చేసింది.