ఐపీఎల్ వేలం పాటల నుంచి డ్రాప్ చేశారు : హ్యూమర్ మ్యాన్

Richard Madley
Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (18:39 IST)
ఐపీఎల్ వేలం పాటల వ్యాఖ్యతగా తనను డ్రాప్ చేశారంటూ 'ది హ్యూమర్ మ్యాన్' రిచర్డ్ మాడ్లీ వెల్లడించాడు. ఇప్పటివరకు 11 సీజన్‌ల కోసం జరిగిన వేలం పాటల కోసం వ్యాఖ్యాతగా రిచర్డ్ మాడ్లీ వ్యవహరించారు. కానీ, ఈనెల 18వ తేదీన జైపూర్ వేదికగా ప్రారంభంకానున్న 12వ ఐపీఎల్ సీజన్‌కు మాత్రం రిచర్డ్ మాడ్లీని దూరంగా ఉండనున్నారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశాడు.

ఐపీఎల్ 2019 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం పాటలకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి 11వ సీజన్ వరకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. కానీ, 2019 సీజన్‌ వేలం పాటలకు దూరంగా ఉంటున్నాను. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఐపీఎల్ వేలం పాటల నుంచి బీసీసీఐ డ్రాప్ చేసింది అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

నిజానికి ఐపీఎల్ వేలం పాటల నుంచి తప్పుకోవడం తన నిర్ణయం కాదు. ఈ వేలానికి హాజరుకావాలని బీసీసీఐ తనను ఆహ్వానించలేదని చెప్పారు. ఏది ఏమైనా భారతదేశంలో తన మిత్రులను, అభిమానులను తాను ఎంతో మిస్ అవుతాని అని రిచర్డ్ మాడ్లీ వ్యాఖ్యానించారు.దీనిపై మరింత చదవండి :