వరల్డ్ కప్ స్టాండ్ బై లిస్టులో పంత్... ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ల ప్లేసులో...

మోహన్| Last Modified బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:02 IST)
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేసారు. ఈ టీమ్‌లో అంబటి రాయుడు, అలాగే రిషబ్ పంత్ పేర్లు ఎంపిక చేయలేదు. అయితే వీరిని ఎంపిక చేయకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలో ఈ ఇద్ద‌రి ప్లేయ‌ర్ల‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం స్టాండ్‌బైగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

వీరితో పాటు పేస్ బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. మే 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను బ్యాక‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఎవ‌రైనా ప్లేయ‌ర్ గాయ‌ప‌డితే, వారి స్థానంలో ఈ ముగ్గురిలో ఒక‌రు వెళ్తార‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు చెప్పారు.దీనిపై మరింత చదవండి :