శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (14:40 IST)

నా చెల్లెలి వంక చూడకు.. రోహిత్ శర్మకు యువీ వార్నింగ్.. ఆమె ఎవరు?

Rohit Sharma_Yuvaraj
టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ చెల్లెల వంక రోహిత్ శర్మ చూసేవాడట. తన చెల్లెలి వంక చూడొద్దని యువరాజ్ సింగ్ రోహిత్‌కు వార్నింగ్ ఇచ్చేవాడట. యువీ సోదరీ ఎవరో తెలుసా? రోహిత్ భార్య రితికా సెజ్దా. వీరిద్దరికి పెళ్లై ఆరేళ్లు గడిచాయి. ఈ జంట ఎప్పుడు కనపడినా.. అందరూ రోహిత్ శర్మ వార్నింగ్‌నే గుర్తు తెచ్చుకుంటుంటారు.  
 
రితికాను యువరాజ్ తన సోదరిలా భావిస్తుంటాడు. వీరిద్దరూ నిజమైన అన్నాచెల్లెళ్లుగా ఉంటుంటారు. రాఖీ పండుగ రోజు యువరాజ్‌కు రాఖీ కూడా కడుతుంది. యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్‌లతో కలసి రోహిత్ షుటింగ్ చేస్తున్న సమయంలోనే తొలిసారి రితికాను కలుగుసుకున్నాడు. 
 
యువీ అప్పటికీ టీమిండియాలో సీనియర్ ప్లేయర్. అతడిని కలిసేందుకు వచ్చిన సమయంలో రోహిత్ శర్మ అతని కాబోయే భార్య రితికను చూశాడు. అప్పుడు రితికనే చూస్తూ ఉండిపోగా.. యువరాజ్ వచ్చి.. అలా చూడకు.. ఆమె నా చెల్లి అని వార్నింగ్ ఇచ్చాడు.
 
యువీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రితికను చూస్తూనే ఉన్నాడు. షూటింగ్ ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. ఏదైనా ప్రాబ్లం వుంటే తనకు చెప్పండి అంటూ రోహిత్ అడిగాడట. అలా వారి జర్నీ పెళ్లి వరకు వచ్చిందట. 2015 డిసెంబర్ 13న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.