Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్రినా - జాక్వలిన్‌లతో డేటింగ్ చేయాలంటున్న ఆ ఇద్దరు క్రికెటర్లు?

బుధవారం, 4 అక్టోబరు 2017 (11:34 IST)

Widgets Magazine

భారత క్రికెట్ జట్టులోని యువ క్రికెటర్లలో యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్‌లు ఉన్నారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో తమ అద్భుత ఆటతీరుతో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. పైగా, టీమిండియాలో స్టార్ ఆటగాళ్లుగా మారిపోయారు.
kuldeep - chahal
 
అయితే, ఈ వీరిద్దరు క్రికెటర్లను మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని ఆసక్తిర ప్రశ్నలు సంధించారు. మహిళాభిమానులు పెరుగుతున్న ఈ తరుణంలో ఎవరైనా మాటలు కలిపితే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు చాహాల్ స్పందిస్తూ, తనకు కనీసం ఐదారేళ్లుగా పరిచయం ఉన్న అమ్మాయి అయితేనే తాను మాట్లాడతానని, లేకుంటే, నా నోట మాటరాదని ఠక్కున బదులిచ్చాడు. 
 
ఇక ఇదే ప్రశ్నకు తాను మాటకారిని కాదని, సిగ్గు ఎక్కువని, ఒకటి రెండు మాటలతోనే సరిపెడతానని కులదీప్ సమాధానమిచ్చాడు. ఎవరితో డేటింగ్ కావాలని అడిగితే చాహాల్ కత్రినా కైఫ్ పేరును, కులదీప్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ పేరును చెప్పారు. ఏ కారు కావాలని అడిగితే, సెకండ్ హ్యాండ్ అయినా 'పోర్స్చ్' కావాలని చాహాల్, 'ముస్తాంగ్' అంటే ఇష్టమని కులదీప్ అన్నారు. డేటింగ్‌కు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారని అడిగితే ఫ్రాన్స్ ద్వీపం బోరాబోరా పేరును చాహాల్, పారిస్ పేరును కులదీప్ చెప్పారు. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

భారత్ అంటే భయపడిపోతున్నారు : ఆసీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా క్రికెటర్లు అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు హడలిపోతున్నారని ఆస్ట్రేలియా తాత్కాలిక ...

news

ఇంకెలాంటి కామెంట్లు పెడతారోనని ఫోటో సీక్రెట్ చెప్పేసిన హార్దిక్ పాండ్యా

భారత క్రికెట్ జట్టులో చోటుదక్కించుకుని అతి తక్కువ కాలంలోనే యువ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు ...

news

వారిని చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోంది : సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక ...

news

భారత్ చేతిలో ఓటమికి సంపూర్ణ అర్హులం : ఆస్ట్రేలియా కెప్టెన్

భారత చేతిలో ఓడిపోవడానికి సంపూర్ణ అర్హులమంటూ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ ...

Widgets Magazine