గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (08:49 IST)

ఢిల్లీ చేతిలో ఓడిన ముంబై - రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా, ఢిల్లీ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఓడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లలో భాగంగా, ఆదివారం ఢిల్లీ వర్సెస్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్ల మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
అయితే, నిర్ధిష్ట సమయంలో తన బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.12 లక్షల అపరాధం విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు.