రోహిత్ శర్మకు విశ్రాంతి.. అంతా వన్డే ప్రపంచ కప్ కోసమేనా?

rohit sharma
Last Updated: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:25 IST)
కివీస్‌తో జరిగిన రెండు వన్డేలు, మూడు ట్వంటీ-20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు భువనేశ్వర్, షమీలకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.


రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అజింక్య రహానేకు చోటు కల్పించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెలవుల్లో వున్న కోహ్లీ, బుమ్రాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని హిట్ మ్యాన్‌కు ప్రస్తుతం రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రహానే, పృథ్వీ షాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే కివీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేలకు, ట్వంసిరీస్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :