శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (08:08 IST)

రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి.. సౌతాఫ్రికాను గెలిపించిన ఎల్గార్

జోహాన్నెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో సఫారీలు విజయవభేరీ మోగించారు. మరోరోజు ఆట మిగిలివుండగానే, ఆ జట్టు గెలిచింది. సఫారీ జట్టు ఎల్లార్ వీరోచితంగా పోరాడి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టెస్ట్ మ్యాచ్ ఆ నెల 11వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 
 
తప్పక గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్‌లో సఫారీ ఆటగాళ్లు విజయం కోసం గట్టిగానే కృషి చేశారు. ముఖ్యంగా, కెప్టెన్ ఎల్గార్ 96 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను సఫారీలు చిత్తు చేశారు. 
 
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్లు మార్ క్రమ్ 31, పీటర్సన్ 28, డుస్సెస్ 40, బవుమా 23 (నాటౌట్) చొప్పున పరుగులు చేసి జట్టు విజయంలో తమ పాత్రను పోషించారు. అయితే, ఈ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ ప్రదర్శన అంతగా ఆకట్టులేక పోయింది. దీనికి నిదర్శనమే అదనపు పరుగుల రూపంలో ఏకగా 25 పరుగులు సమర్పించారు. భారత బౌలర్లలో షమీ, ఠాకూర్, అశ్విన్‌లో ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
కాగా, మూడు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో సెంచూరియన్ పార్కులో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు గెలుపొందింది. దీంతో కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 11వ తేదీ నుంచి కేప్‌టౌన్ వేదికగా జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, సౌతాఫ్రికా 229 చొప్పున పరుగులు చేశాయి. ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 243/3 పరుగులు చేసి 240 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయంగా ఛేదించింది. 
 
కాగా, జోహాన్నెస్‌బర్గ్‌ మైదానంలో భారత్‌కు తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్‌లను భారత్ ఆడగా అందులో రెండు మ్యాచ్‌లలో గెలుపొంది, మూడింటిని డ్రా చేసుకుంది.