Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లిటిల్ట్ మాస్టర్‌తో లిటిల్ ఫ్యాన్.. ఆ తేదీని క్యాలెండర్‌లో మార్కు లేదా సేవ్ చేసుకోండి..

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:02 IST)

Widgets Magazine

టీమిండియా స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ కుమార్తె హినయ హీర్‌తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడుకున్నాడు. ఆ ఫోటోలను సచిన్ ట్విట్టర్‌లో పెట్టి తన సంతోషాన్ని పంచుకోగా దాన్ని హర్భజన్‌, అతని భార్య రీట్వీట్ చేశారు. సచిన్‌కు భజ్జీ ధన్యవాదాలు తెలపగా, అతని భార్య గీతా బస్రా స్పందిస్తూ.. లిటిల్ మాస్టర్‌తో లిటిల్ ఫ్యాన్ అంటూ కామెంట్ చేసింది. భజ్జీ కుమార్తెను ఎత్తుకుని మాస్టర్ సంతోషంగా గడిపాడు. 
 
ఇదిలా ఉంటే.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన బయోపిక్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. సచిన్ టెండూల్కర్ నటించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను త్వరలోనే వెండి తెరపై చూడొచ్చు. తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' విడుదల తేదీని మాస్టర్‌ ట్విటర్‌లో సోమవారం ప్రకటించాడు. మే 26వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఆ డేట్‌ను క్యాలెండర్‌లో మార్కు చేసుకోండి లేకపోతే సేవ్ చేసుకోండని సచిన్ ట్వీట్ చేశాడు. 
 
ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ ఎర్సికిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్‌ టెండూల్కర్ తన పాత్రను తానే పోషించాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మొదటి పోస్టర్‌ను ఏప్రిల్ 2016లో విడుదల చేశారు. ఈ చిత్రంలో సచిన్ యువకుడిగా ఉన్న సన్నివేశాల్లో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ నటించనుండటం మరో విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Shares Daughter Biopic May20 Harbhajan Singh Sachin Tendulkar

Loading comments ...

క్రికెట్

news

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. కరుణ్ నాయర్‌కు చోటు.. విరాట్ కోహ్లీ 20వ టెస్టులోనూ రాణిస్తుందా?

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటివరకు 19 టెస్టుల్లో తన విజయ పరంపరను ...

news

అంధుల క్రికెట్‌పై సెహ్వాగ్ ట్వీట్ వివాదాస్పదం.. రెండు కుక్కలు నరకానికి చేరాయ్..

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ...

news

ప్రత్యర్థుల గౌరవం పొందుతున్న అరుదైన జట్టు కోహ్లీ టీమ్

భారత క్రికెట్ జట్టుకు ఇది స్వర్ణయుగం అనే చెప్పాలి. ఒక కీలక వికెట్ పడగొడితే చాలు భారత్ ...

news

జట్టు సభ్యులవల్లే ఈ కీర్తీ ప్రతిష్టలూ, గుర్తింపులూ అంటున్న కోహ్లీ

మైదానంలో ఫీల్డింగ్ ఎవరైనా సెట్ చేయగలరని, అయితే తనకు కెప్టెన్‌గా పేరొచ్చిందంటే అది జట్టు ...

Widgets Magazine