శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:21 IST)

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా సచిన్.. ఎంపికలో వారిద్దరే కీలకం!

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మూడేళ్ల కాంట్రాక్టు పరిమితితో సచిన్ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌కు చెందిన డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
 
అయితే, కోచ్‌గా సచిన్ పేరును తెరపైకి తీసుకుని రావడంలోనూ, ఎంపిక చేయడంలోనూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీలే కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. అంతేకాకుండా కోచ్ పదవికి సచిన్ పేరును తొలుత ప్రతిపాదించింది కూడా వారేనని విశ్వసనీయ సమాచారం. 
 
కోచ్ పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసేందుకు మంగళవారం కీలక సమావేశం నిర్వహించిన బీసీసీఐ కార్యనిర్వాహక కమిటీ సచిన్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడగానే స్పందించిన కెప్టెన్ ధోనీ, సచిన్ మార్గదర్శకత్వంలో టీమిండియా జట్టు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కష్టపడేతత్వం, క్రమశిక్షణ, అంకితభావం తదితర అంశాల్లో సచిన్‌కు సాటి రాగలవారెవ్వరూ లేరని ధోనీ కితాబిచ్చాడు.