ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (09:19 IST)

వైవాహిక బంధానికి బీటలు ... వేర్వేరుగా సానియా - షోయబ్ మాలిక్?

sania mirza - malik
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ జట్టు మాజీ క్రికెటర్ షోయల్ మాలిక్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇపుడు వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం, షోయబ్ మాలిక్‌కు పాకిస్థాన్ మోడల్‌లో ఎఫైర్ ఉన్నట్టు గుసగుసలు వినపిస్తున్నాయి. వీటిని నిజమని బలంగా నమ్మిన సానియా మీర్జా గత కొన్ని రోజులుగా తన భర్తకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. తాజాగా వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చిపెడుతున్నాయి. 
 
"బద్ధలైన హృదయాలు అల్లాను వెతుక్కుంటూ వెళ్తాయి" అంటూ సానియా మీర్జా తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో కామెంట్స్ చేశారు. అలాగే, ఓ టీవీ షోలో ఓ అభిమాని వేసిన ప్రశ్నకు షోయబ్ మాలిక్ ఇచ్చిన సమాధానం కూడా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
సానియా మీర్జా నిర్వహించే టెన్నిస్ అకాడెమీల గురించి చెప్పాలని అడగ్గా ఆమెకు ఎక్కడెక్కట అకాడెమీలో ఉన్నాయో తనకు తెలియదని బదులిచ్చాడు. ఆ సమాధానం విని మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా ఆశ్చర్యపోయాడు. వారిద్దరూ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి విడిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా వారిద్దరూ గత కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్టు సమాచారం. 
 
కాగా, గత 2010లో ఒక్కటైన ఈ దంపతులకు 2018లో ఓ బాబు కూడా జన్మించాడు. వివాహం తర్వాత వీరిద్దరూ దుబాయ్‌లో ఉంటున్నారు. గతంలోనే వీరిద్దరూ కలిసి దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విలాసవంతమైన జమేరా పామ్ ఐలాండ్‌లో విలాసవంతమైన విల్లాలో ఉండేవారు. అయితే, కుమారుడి చదువు కోసం దుబాయ్‌లో ఇపుడు వారు మరో ప్రాంతానికి మారినట్టు సమాచారం.