హీరోయిన్‌గా మారనున్న సచిన్ కుమార్తె.. వారు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?  
                                       
                  
                  				  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత  ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక సచిన్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మోడలింగ్‌పై మొగ్గుచూపిన సారా.. త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనున్నారని సమాచారం.
				  											
																													
									  
	 
	గతంలో ఓ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో నటించిన ఈమె.. ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాలో నటించనుందని సమాచారం. తల్లి అంజలి టెండూల్కర్ బాటలో నడుస్తూ లండన్‌లో మెడిసిన్ విద్యను పూర్తి చేసింది. 
				  
	 
	సారా టెండూల్కర్ అందానికి ముగ్దులైన కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, చాలా రోజుల కిందటే ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నించారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అయితే సారా మాత్రం అప్పుడు మెడిసిన్ పూర్తి చేయడంపైనే ఫోకస్ పెట్టినట్టు చెప్పేసింది. మెడిసిన్ పూర్తి కావడంతో ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట సారా టెండూల్కర్. 
				  																		
											
									  
	 
	ఇందుకోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చాడని సమాచారం. ఇక బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని సినీ పండితులు అంటున్నారు.