వన్డే ప్రపంచకప్ ట్రోఫీని విడుదల చేసిన ఐసీసీ.. షారూఖ్ అలా చూస్తూ..?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో వున్న ఫోటోను ఐసీసీ షేర్ చేసింది. సీడబ్ల్యూసీ 23 ట్రోఫీతో కింగ్‌ఖాన్ అని దానికి క్యాప్షన్ తగిలించింది.
ప్రపంచకప్ కోసం కోట్లాదిమంది భారతీయులు, ఆటగాళ్లలానే షారూఖ్ కూడా ట్రోఫీ వైపు ఆరాధనగా చూస్తున్నట్లుగా వున్న ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు దేశానికి తొలి ప్రపంచకప్ ట్రోఫీ అందించగా, ఆ తర్వాత 2011లో మహేంద్ర సింగ్ కెప్టెన్సీలో రెండో కప్ వచ్చింది. ముచ్చటగా మూడో ట్రోఫీపై భారత జట్టు కన్నేసింది. ఈ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం టీమిండియాకు కలిసివచ్చే అంశం.
అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. అదే నెల 15న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ తలపడతాయి.