Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అర్ధ సెంచరీలతో రోహిత్-ధావన్ సరికొత్త రికార్డు.. పటిష్ట స్థితిలో టీమిండియా.. 33 ఓవర్లలో 173/1

హైదరాబాద్, ఆదివారం, 4 జూన్ 2017 (18:10 IST)

Widgets Magazine
rohit sharma

ఆరంభం అదిరింది. చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు అదరగొట్టారు. తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు సరికొత్త రికార్డు సృష్టించడమే కాకుండా చెరొక హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. ఈ క్రమంలో ఈ టోర్నీలో మూడో సెంచరీ భాగస్వామ్యం సాధించారు. తద్వారా అత్యధిక శతకాల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా అరుదైన ఫీట్‌ను నెలకొల్సారు. 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 173 పరుగులు చేసిన భారత్ పటిష్ట స్థితిలో ఉంది. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
 
 
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.  రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు భారత ఇన్నింగ్స్‌ను కుదురుగా ఆరంభించారు. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ ఆపై బ్యాట్ ఝుళిపించారు. ఈ క్రమంలోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్ గా అవుటయ్యాడు. అర్ధశతకం బాదిన శిఖర్‌ ధావన్‌ (68; 65 బంతుల్లో 6×4, 1×6) షాదాబ్‌ వేసిన 25 ఓవర్‌ 3వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి అజార్‌అలీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో సారథి విరాట్‌కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 108 బంతుల్లో 77 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 173/1 స్కోరుతో ఉంది.
 
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అర్ధశతకాలు నమోదు చేశారు. 15 ఓవర్ల వరకూ ఆచితూచి ఆడిన శిఖర్‌ ధావన్‌ (61; 55 బంతుల్లో 5×4, 1×6), రోహిత్‌శర్మ (60; 78 బంతుల్లో 6×4, 1×6) ఆ తర్వాత గేరు మార్చారు. వరుసగా బౌండరీలు, సిక్సర్లు బాదేసి అర్ధశతకాలు పూర్తిచేశారు. రియాజ్‌ వేసిన 20 ఓవర్‌లో ధావన్‌ మూడు బౌండరీలు కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు వచ్చాయి. ఇక 21వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. దీంతో 22 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 125/0తో పటిష్ఠ స్థితిలో ఉంది. 49 పరుగుల వద్ద షాదాబ్‌ వేసిన 18.5వ బంతిని భారీ సిక్సర్‌ బాదిన రోహిత్  అర్ధశతకం సాధించాడు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభం.. ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్ ...

news

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య కీలక పోరు నేడే..

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆసక్తికరమైన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది. ...

news

బీసీసీఐ తీరుపై గుహ బాంబ్.. బలిపశువు ఎవరు.. ధోనీ.. కోహ్లీ.. కుంబ్లే.. టెన్షన్ టెన్షన్

బీసీసీఐ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. పేరులో ఉన్నట్లే భారత క్రికెట్‌కు చెందిన ...

news

ధోనీ అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా.. అందుకే పాక్ జట్టు వణుకుతోందా?

దాయాదుల మధ్య ఇంకా ఆటే మొదలు కాలేదు. అయినా సరే టీమిండియాతో పోటీ అంటే పాకిస్తాన్ జట్టుకు, ...

Widgets Magazine