1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (12:44 IST)

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంక పర్యటనకు టీమిండియా

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. అదేసమయంలో శ్రీలంక పర్యటన రావడంతో శిఖర్ ధావన్ నేతృత్వంలో మరో జట్టును ఎంపిక చేసి, కొలంబోకు పంపించారు. ఈ జట్టుకున రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టు నేడు శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లింది. 
 
ఈ పర్యటనలో భారత జట్టు పరిమితి ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు ఆడనుంది. జులై 13 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు శ్రీలంకతో 3 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దేవదత్ పడిక్కల్ వంటి ప్రతిభావంతులతో కూడిన టీమిండియాను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాలే అని చెప్పవచ్చు.
 
భారత జట్టు వివరాలు.. 
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా ఉంటారు. వీరితోపాటు ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయికిశోర్, సిమర్జీత్ సింగ్ నెట్ బౌలర్లుగా భారత జట్టుకు ఈ పర్యటనలో సహకరిస్తారు.