సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (11:00 IST)

చేతన్ శర్మ రాజీనామా... తాత్కాలిక అధ్యక్షుడిగా శివ సుందర్ దాస్‌

bcci
భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ అధిపతిగా చేతన్ శర్మ రాజీనామా చేయడంతో శివ సుందర్ దాస్ భారత క్రికెట్ జట్టు తాత్కాలిక అధిపతిగా నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
ఇటీవల, భారత క్రికెట్ జట్టు సెలక్షన్ హెడ్ చేతన్ శర్మ వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత రాజీనామా చేశారు. అతని రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జయషా ఆమోదించడం గమనార్హం. 
 
ఈ స్థితిలో చేతన్ శర్మ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో శివ సుందర్ దాస్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.