శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (10:55 IST)

పాక్ జట్టుకు ఆసీస్ చేతిలో షాక్.. వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు..

దాయాది జట్టు చేతిలో ఓటమిని అసలు జీర్ణించుకోలేరు. సెమీస్ చేరకుండానే భారత్ కథ ముగియగా.. తాజాగా కప్పు నెగ్గుతుందని భావించిన పాక్ జట్టు రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో నిరాశగా ఇంటిబాట పట్టింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఐదు వికెట్లతో విజయం సాధించింది. 
 
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో మరో 6 బంతులు మిగిలుండగానే ఆసీస్ ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో కంగారూలు తలపడనున్నారు. ఏ జట్టు గెలిచినా సరికొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుంది.
 
పాక్ జట్టు ఓడిపోగానే ఆ దేశానికి చెందిన ఓ బాలుడు వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఈ వీడియోను పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పోస్ట్ చేశాడు. తమ జట్టు అద్బుతంగా ఆడి.. చివరికి ఓటమి పాలైతే పరిస్థితి ఇలా ఉంటుందని అక్తర్ తన పోస్టులో రాసుకొచ్చాడు.
 
సలేహ్ అనే బాలుడు పాక్ ఓటమిని జీర్ణించుకోలేక ఏడ్చేశాడు. జట్టు అద్బుతంగా ఆడితే అభిమానులు బాగా ఇన్వాల్స్ అవుతారు. చివరికి ప్రతికూల ఫలితం వస్తే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయని అక్తర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.