శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (13:23 IST)

ఆసీస్ వెన్నువిరిచిన భారత బౌలర్లు : భారత్ టార్గెట్ 328 రన్స్

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. భారత బౌలర్ల దెబ్బకు 294 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన పరుగులతో కలుపుకుని మొత్తం 328 పరుగుల టార్గెట్ విధించింది. 
 
నాలుగోరోజున రెండో ఇన్నింగ్స్ నుకొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును 294 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ అయింది. తొలి టెస్ట్ ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లను పడగొట్టగా, మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ కుఒక వికెట్ లభించింది.
 
ఆసీస్ ఆటగాళ్లలో మార్కస్ 38, వార్నర్ 48, లబుషేన్ 25, స్టీవ్ స్మిత్ 55, మ్యాథ్యూ వేడ్ 0, కెమెరాన్ గ్రీన్ 37, టిమ్ పైనీ 27, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లియాన్ 13, హాజల్ వుడ్ 9 పరుగులు చేసి అవుట్ కాగా, పాట్ కమిన్స్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని, ఆస్ట్రేలియా 327 పరుగులు చేసినట్లయింది.
 
ఈ మ్యాచ్ గెలవాలంటే, భారత్ ముందు సుమారు వంద ఓవర్లకు పైగా ఉన్నాయి. దీంతో భారత ఆటగాళ్లు నిలదొక్కుకుని ఆడితే, విజయం ఏమంత అసాధ్యం కాదని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సాధ్యమైనంత ఎక్కువసేపు నేడు క్రీజులో గడిపితే, రేపు చివరి రోజున ఏ ఇద్దరు రాణించి సెంచరీలు చేసినా, భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి.